Jagadish Reddy | కేసీఆర్ కాలి గోటికి కూడా సరితూగని వాళ్లు ఆయనపై విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర మాజీ మంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యమ కాలం నుంచే కుట్రలు చేసిందని ఆయన ఆరోపించారు. నల్లగొండలో శనివారం జరిగిన అసెంబ్లీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల బాధలు తెలిసిన నేత కేసీఆర్ అని, అందుకే కరెంట్ కోతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దామని చెప్పారు. ధాన్యం, ఆహార ఉత్పత్తుల్లో అగ్రగామిగా తీర్చిదిద్దారని, తెలంగాణను తన కుటుంబంగా భావించ...